Prabhakar: మా అబ్బాయి తప్పు చేశాడు.. కానీ: నటుడు ప్రభాకర్ ఆవేదన

Prabhakar Apologizes for Son Chandrahass Actions at Movie Event
షార్ట్స్‌లో చూడండి
టీవీ నటుడు ప్రభాకర్ తన కుమారుడు చంద్రహాస్ చేసిన తప్పుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతులతో పాట పాడటంపై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన స్పందించారు. తన కుమారుడిని పద్ధతిగానే పెంచానని, ఒక్క తప్పుతో అంచనా వేయవద్దని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు.

చంద్రహాస్ హీరోగా పరిచయమైన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఆయన అత్యుత్సాహంతో సినిమాలోని పాటకు కొన్ని బూతు పదాలు జోడించి పాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు, మీడియా ప్రతినిధులు చంద్రహాస్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ప్రభాకర్ పెంపకాన్ని కూడా ప్రశ్నించారు.

ఈ వివాదంపై తాజాగా ప్రభాకర్ తెర ముందుకు వ‌చ్చి మాట్లాడారు. "మా అబ్బాయి తప్పు చేశాడు. ఈ విషయం నేను వాడికి చెప్పాను. కానీ, కొందరు మా ఫ్యామిలీ గురించి, నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడారు. నేను నా కొడుకును పద్ధతిగానే పెంచాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆహ్వానం మేరకు ఈవెంట్‌కు అతిథులుగా వచ్చిన జేడీ చక్రవర్తి, జయంత్ సి పరాన్జీలకు తన వల్ల మాటలు పడాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఉందని, తన కుమారుడి నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయని ప్రభాకర్ భావోద్వేగంతో చెప్పారు. ఆయన క్షమాపణ చెప్పిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.

Go Back to Shorts
Prabhakar
Chandrahas
Barabar Premista
Telugu actor Prabhakar
JD Chakravarthy
Jayanth C Paranjee
Movie promotion controversy
Telugu cinema news
Viral video apology
Parenting criticism

More Telugu News