వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ
- తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న శ్రీనివాసవర్మ
- కల్తీ జరిగిందని వైవీ, భూమన, చెవిరెడ్డి ఇప్పుకున్నారని వ్యాఖ్య
- స్వామివారికి హారతి ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారని మండిపాటు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పారు. లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అన్నారు. కానీ, ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని శ్రీనివాసవర్మ అన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ అని ప్రశ్నించారు. బోలేబాబాకు పాల ఉత్పత్తి, డెయిరీ లేకపోయినా నెయ్యి తయారు చేశారని వివరించారు.
టెండర్ల నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేశారని... అవినీతి కోసం అలా చేశారని అన్నారు. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తామని... అలాంటి నెయ్యిని కల్తీ చేశారని మండిపడ్డారు. అర్హత లేని వారికి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారుశ.