జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం
- మేడారం మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు
- సుమారు 3 వేల టన్నుల చెత్త పోగైనట్లు అధికారుల అంచనా
- శుభ్రం చేసేందుకు రంగంలోకి దిగిన 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు
- జంతు వ్యర్థాలు చూసి వాంతులొస్తున్నాయని కార్మికుల ఆవేదన
- వ్యర్థాల్లో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలు ఉండటంపై ఆందోళన
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు వెనుదిరిగిన అనంతరం మేడారం పరిసరాలు టన్నుల కొద్దీ చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి, పారిశుద్ధ్య సిబ్బందికి పెను సవాల్‌గా మారింది.
మేడారంతో పాటు కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు వంటి ప్రాంతాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో సుమారు 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాతిపదికన శుభ్రతా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
అయితే, ఈ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జంతువుల తోళ్లు, తలకాయలు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయి. ఇంత గలీజు పని మేమెప్పుడూ చేయలేదు" అని కొందరు కార్మికులు వాపోయారు. అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నాం అని వారు కన్నీటిపర్యంతమయ్యారు.
జాతరలో పోగైన వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 100 టన్నుల ఖాళీ బాటిళ్లలో చాలా వరకు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. మిగిలిన 52 శాతం బియ్యం, బెల్లం వంటివి భూమిలో కలిసిపోయేవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యర్థాలను వేరు చేసి, మేడారం ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.