Kandula Durgesh: నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్

AP Minister Kandula Durgesh Key Announcement on Nandi Awards
షార్ట్స్‌లో చూడండి
సినిమా, టీవీ, నాటకరంగ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని... త్వరలోనే అవార్డులు ఇస్తామని తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం (టీడీపీ) ఇచ్చిందని... ఆ తర్వాత మళ్లీ ఇవ్వలేదని దుర్గేశ్ తెలిపారు. అప్పటి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా అవార్డులు ఇవ్వాలా? లేక మార్పులు ఏమైనా చేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ నుంచి ఈ అవార్డులపై సలహాలు తీసుకుంటామని తెలిపారు. రెండు, మూడు నెలల్లో అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించారు. నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. 

టీడీపీ హయాంలో ఇచ్చిన నంది అవార్డుల వివరాలు:
2014: ఉత్తమ చిత్రం - లెజెండ్. ఉత్తమ నటుడు - బాలకృష్ణ (లెజెండ్).
2015: ఉత్తమ చిత్రం - బాహుబలి (ది బిగినింగ్). ఉత్తమ నటుడు - మహేశ్ బాబు (శ్రీమంతుడు).
2016: ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు. ఉత్తమ నటుడు - జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో).
Go Back to Shorts
Kandula Durgesh
Nandi Awards
AP Minister
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Nandamuri Balakrishna
Telugu Cinema
Legend Movie
Baahubali
Pelli Choopulu

More Telugu News