Ola Uber: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ఓలా, ఉబర్ సేవలు: నేడు ‘ఆల్ ఇండియా బ్రేక్ డౌన్’!

Ola Uber Services Face Disruption Nationwide Due to Gig Workers Strike
  • నేడు 6 గంటల పాటు డ్రైవర్ల సమ్మె
  • కనీస ఛార్జీల నిర్ణయంపై సర్కారుకు అల్టిమేటం
  • దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం
యాప్ ఆధారిత రవాణా సేవలైన ఓలా, ఉబర్, ర్యాపిడో వాహనాల చక్రాలు నేడు ఆగిపోనున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు శనివారం (ఫిబ్రవరి 7) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ‘ఆల్ ఇండియా బ్రేక్ డౌన్’ పేరుతో చేపడుతున్న ఈ నిరసనలో భాగంగా డ్రైవర్లందరూ ఉదయం నుంచి 6 గంటల పాటు యాప్‌ల నుంచి లాగ్-అవుట్ కానున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి పలు జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.

ముఖ్యంగా అగ్రిగేటర్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను నిర్ణయిస్తూ డ్రైవర్లను శ్రమదోపిడీకి గురిచేస్తున్నాయని యూనియన్ ఆరోపిస్తోంది. 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025' అమల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కనీస ఛార్జీలను నోటిఫై చేయకపోవడం వల్ల డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రైవేట్ నంబర్ ప్లేట్ వాహనాలను కమర్షియల్ అవసరాలకు వాడటం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, దీనిపై తక్షణమే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన 'ఎకనామిక్ సర్వే 2025-26' సైతం గిగ్ వర్కర్ల దయనీయ స్థితిని ఎత్తిచూపింది. దేశంలో సుమారు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయంతో సరిపెట్టుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'భారత్ టాక్సీ' అనే సహకార ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం ఈ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. 
Ola Uber
Ola Uber strike
gig workers strike
All India Break Down
TGPWU
Telangana Gig and Platform Workers Union
Bharat Taxi
Motor Vehicle Aggregator Guidelines 2025
economic survey 2025 26
ride hailing services

More Telugu News