Sunil Motilal Sandarangani: దేవుడిని ప్రార్థించి 17వ అంతస్తు నుంచి దూకిన బేకరీ యజమాని

Sunil Motilal Sandarangani Commits Suicide by Jumping from Building in Solapur
  • మహారాష్ట్రలోని షోలాపూర్‌లో దుర్ఘటన
  • కదలికలపై అనుమానం రావడంతో సెక్యూరిటీని అప్రమత్తం చేసిన స్థానికులు
  • వ్యాపారిని కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ సిబ్బంది
  • మళ్ళీ 17వ అంతస్తుకు చేరుకుని ఆత్మహత్య
మహారాష్ట్రలోని షోలాపూర్‍‌లో వ్యాపారవేత్త, ముల్తానీ బేకరీ యజమాని సునీల్ మోతీలాల్ సందరంగానీ (59) 17 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవనం నుంచి దూకడానికి ముందు ఆయన అదే స్థలంలో చేతులు జోడించి దేవుడిని ప్రార్థించారు. వెల్లకిలా పడుకుని కూడా దేవుడిని ప్రార్థించారు. అనంతరం ఆయన కిందకు దూకుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

కొన్నేళ్లుగా పుణేలో నివసిస్తున్న ఆయన, ఇటీవల షోలాపూర్‌ తిరిగి వచ్చారు. నిన్న మధ్యాహ్నం విజయపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న పనాష్ అపార్ట్‌మెంట్స్‌కు తన కారులో చేరుకుని, మెట్లు మార్గంలో 17వ అంతస్తుకు వెళ్లారు. టెర్రస్‌ అంచున నిల్చొని దేవుడికి ప్రార్థన చేశారు. అతని కదలికలను గమనించిన కొంతమంది భవనం సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ గార్డు త్వరగా పైకి వెళ్లి అతనిని కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.

పదో అంతస్తుకు చేరుకున్న అనంతరం, తన కారు కీని పైనే మరిచిపోయానని సునీల్ మోతీలాల్ మళ్లీ పై అంతస్తులకు వెళ్లి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించే లోపు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Sunil Motilal Sandarangani
Solapur
Pune
Maharashtra
Panash Apartments
Suicide
Bakery owner

More Telugu News