Janasena: గాజు గ్లాస్ గుర్తుపై... తెలంగాణలో జనసేన ఎన్ని వార్డుల్లో పోటీ చేస్తోందంటే?

Janasena Contesting in 336 Wards in Telangana Municipal Elections
  • 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటన
  • అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 56, అత్యల్పంగా మహబూబాబాద్‌లో 5 వార్డుల్లో పోటీ
  • జనసైనికులు, వీర మహిళలు అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. జిల్లాల వారీగా తమ పార్టీ అభ్యర్థులు ఎంత మంది పోటీ చేస్తున్నారో పేర్కొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 56 వార్డుల్లో, అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాలో 5 వార్డుల్లో పోటీ చేస్తోంది.

11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 336 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారని తెలిపింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు పై పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జనసైనికులు, వీర మహిళలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఏ జిల్లాల్లో ఎన్ని వార్డులలో పోటీ చేస్తుందంటే... నిజామాబాద్‌లో 48, కొత్తగూడెంలో 22, రంగారెడ్డిలో 21, ఖమ్మంలో 17, వరంగల్‌లో 20, నల్గొండలో 46, మహబూబ్ నగర్‌లో 44, మహబూబాబాద్‌లో 5, మెదక్‌లో 18, కరీంనగర్‌లో 56, ఆదిలాబాద్‌లో 39 వార్డుల్లో పోటీ చేస్తోంది.
Janasena
Telangana Municipal Elections
Janasena Party
Glass Symbol
Telangana Elections 2024

More Telugu News