"వైభవ్‌ను అరెస్ట్ చేయాలి"... సూర్యవంశీ విధ్వంసక శతకంపై క్రికెట్ ప్రపంచం ఫిదా!
- అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీ
- కేవలం 80 బంతుల్లో 175 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్
- సూర్యవంశీపై క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసల వర్షం
- సూర్యుడిని ఆపలేరంటూ వైభవ్‌ను కొనియాడిన వీరేంద్ర సెహ్వాగ్
- అండర్ 19 ఫైనల్లో అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించిన వైభవ్
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో 14 ఏళ్ల భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనంపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో కేవలం 80 బంతుల్లో 175 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌తో అతను పెను సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా అభివర్ణిస్తున్నారు.
ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు సరదాగా స్పందిస్తూ, "ఇంగ్లండ్ బౌలర్లపై ఈ హింస దారుణం. వైభవ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!" అని ట్వీట్ చేసింది.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. "సూర్యవంశీ అంటే సూర్య వంశం నుంచి పుట్టినవాడు. ఈరోజు అతను అలాగే ఆడాడు. ప్రజ్వలించాడు. ప్రత్యర్థులను అంధులను చేశాడు. ఆపలేని శక్తిగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లు అన్నీ ప్రయత్నించారు. కానీ సూర్యుడిని ఎవరూ ఆపలేరు. భారత క్రికెట్‌లో సూర్యుడు ఉదయించాడు! ఇది భవిష్యత్తుకు ఒక సంకేతం" అని సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో సమాన విధ్వంసం సృష్టించాడని కొనియాడాడు.
పఠాన్ సోదరులు యూసుఫ్, ఇర్ఫాన్ కూడా వైభవ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. "అతడి వయసు 14 ఏళ్లు. భయం లేదు... ఒత్తిడి లేదు... కేవలం స్వచ్ఛమైన ప్రతిభ! వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక ఇన్నింగ్స్ ఆడలేదు, భారత క్రికెట్ భవిష్యత్తును ప్రకటించాడు" అని యూసుఫ్ పఠాన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడటం అతని నిలకడకు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి నిదర్శనమని, అతను ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్, 2012 ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ (111*) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. దీనిపై స్పందించిన ఉన్ముక్త్ చంద్, వైభవ్ ఫోటోను షేర్ చేస్తూ 'డిఫరెంట్ బ్రీడ్' (ఇతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడు) అని కొనియాడాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ "వైభవ్ సూర్యవంశీ.. ఇది చాలా చాలా ప్రత్యేకం" అని వ్యాఖ్యానించాడు.
"ఏక్ బిహారీ సబ్ పే భారీ!" అంటూ భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన రాష్ట్రానికి చెందిన వైభవ్‌ను అభినందించాడు. శిఖర్ ధావన్, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యారు. వైభవ్ సెంచరీ, ఆయుష్ మాత్రే అర్ధ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.