సింగపూర్ నుంచి చైనాకు వెళుతున్న నౌకలో భారత అధికారి అదృశ్యం
- మర్చంట్ నేవీ అధికారి సార్ధక్ మహాపాత్రో అదృశ్యం
- ఫిబ్రవరి 2న తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన నేవీ అధికారి
- మరుసటి రోజు నుంచి అదృశ్యం
మరుసటి రోజు నుంచి అతడిని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సార్ధక్ కనిపించడం లేదని ఆ తర్వాత షిప్పింగ్ కంపెనీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. సార్ధక్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని, తన కొడుకును త్వరగా తీసుకురావాలని సార్ధక్ తల్లి విజ్ఞప్తి చేశారు.