రేవంత్ రెడ్డికి హైకోర్టులో నిరాశ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురయింది. 2023 ఎన్నికల సమయంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలని కోరతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టారని రేవంత్ తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ, రేవంత్ పిటిషన్ ను తిరస్కరించింది. తదుపరి విచారణను ఈ నెల  21వ తేదీకి వాయిదా వేసింది.

కేసు వివరాల్లోకి వెళితే... రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2023లో జరిగిన ఎన్నికల సమయంలో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

దీంతో, తన వక్తిత్వాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకరంగా మాట్లాడారంటూ పోలీసులకు గండ్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.


More Telugu News