AR Rahman: ఆ విషయం మర్చిపోయా.. వివాదంపై ఏఆర్ రెహమాన్ ఫుల్ క్లారిటీ

AR Rahman Addresses Past Controversial Statements in New Interview
షార్ట్స్‌లో చూడండి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆ సంఘటనను తాను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపోతున్నానని స్పష్టం చేశారు. ఈ వివాదంపై మాట్లాడేందుకు మొదట నిరాకరించినప్పటికీ, చివరికి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కొంతకాలం క్రితం ‘బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో హిందీ పరిశ్రమ ఉందని ఆయన పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ప్రముఖులు సైతం స్పందించారు.

ఈ వివాదంపై గతంలోనే సోషల్ మీడియా ద్వారా స్పందించిన రెహమాన్.. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, భారతదేశం తనకు స్ఫూర్తి అని చెప్పారు. తాజాగా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ, "మనమేంటో తెలిసినవారికి ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా వాళ్లు వినరు" అంటూ నవ్వుతూ బదులిచ్చారు. జీవితంలో కొన్ని విషయాల నుంచి త్వరగా బయటపడటం మంచిదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం సద్దుమణుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Go Back to Shorts
AR Rahman
AR Rahman controversy
Bollywood gang
BBC Asian Network
Hindi film industry
AR Rahman interview
music director
Indian music
ARR statements
creative freedom

More Telugu News