Shreyanka Patil: డబ్ల్యూపీఎల్ ‘క్వీన్స్’ ఆర్‌సీబీ: స్మృతి మంధానకు అంకితమిచ్చిన శ్రేయాంక
- రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు
- 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం
- కెప్టెన్ స్మృతి మంధాన పోరాటానికి దక్కిన గౌరవం
- 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
గుజరాత్‌లోని వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కెప్టెన్ స్మృతి మంధాన (87), జార్జియా వోల్ (79) అద్భుత బ్యాటింగ్‌తో విజేతగా నిలిచింది. ఈ గెలుపు తనకెంతో ప్రత్యేకమని ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ ఉద్వేగానికి లోనైంది.
గత కొన్ని నెలలుగా కెప్టెన్ స్మృతి మంధాన ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అందుకే ఈ అద్భుత విజయాన్ని ఆమెకే అంకితమిస్తున్నానని శ్రేయాంక తెలిపింది. "గత ఏడాది గాయం కారణంగా నేను ఆటకు దూరమయ్యాను. మళ్లీ ఈ సీజన్‌లో పునరాగమనం చేస్తూ టైటిల్ గెలవడం ఆనందంగా ఉంది. బెంగళూరు, కర్ణాటక అభిమానులు మాపై చూపిన నమ్మకం వల్లే 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా మేము ఛేదించగలిగాం" అని ఆమె పేర్కొంది. డగౌట్‌లో ఉన్న సానుకూల వాతావరణమే తమ విజయ రహస్యమని ఆమె వివరించింది.
విజయానికి అవసరమైన విన్నింగ్ రన్స్‌ను సాధించిన రాధా యాదవ్, మేనేజ్‌మెంట్ అందించిన మద్దతును కొనియాడింది. "మేము అడిగిన దానికంటే ఎక్కువే మేనేజ్‌మెంట్ మాకు అందించింది. ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫైనల్‌కు ముందు క్రికెట్ గురించి ఆలోచించకుండా మాకు ఇచ్చిన విరామం ఎంతగానో ఉపయోగపడింది" అని రాధా వెల్లడించింది. తన తదుపరి లక్ష్యం భారత జట్టుకు ప్రపంచకప్ అందించడమేనని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
ఈ గెలుపుతో ఆర్సీబీ జట్టు డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. మైదానంలో ఆర్సీబీ అభిమానుల నినాదాలు, ప్లేయర్ల పోరాట పటిమ వెరసి వడోదర స్టేడియం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. స్మృతి మంధాన నాయకత్వం, మేనేజ్‌మెంట్ వ్యూహాలు పక్కాగా అమలు కావడంతో ఈ కప్పు బెంగళూరు సొంతమైంది.