Piyush Goyal: అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందంపై త్వరలో ఉమ్మడి ప్రకటన: పీయూష్ గోయల్

Piyush Goyal announces joint statement soon on US India trade deal
  • రెండు దేశాల నుంచి వచ్చే వారంలో సంయుక్త ప్రకటన
  • ఒప్పందానికి సంబంధించి ముసాయిదా తుది రూపు సిద్ధమవుతోందని వెల్లడి
  • మార్చి నెల మధ్యలో సంతకాలు జరిగే అవకాశముందన్న పీయూష్ గోయల్
భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై త్వరలో ఉమ్మడి ప్రకటన ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది మొదటి అంకమని ఆయన అన్నారు. రెండు దేశాల నుంచి వచ్చే వారంలో సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఒప్పందానికి సంబంధించి ముసాయిదా తుది రూపు సిద్ధమవుతోందని పీయూష్ గోయల్ అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి మార్చి నెల మధ్యలో సంతకాలు జరిగే అవకాశముందని వెల్లడించారు.

ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం, భారతదేశంపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును విడుదల చేస్తుంది. మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడడం తెలిసిందే. అనంతరం ట్రంప్ "భారతదేశానికి చెందిన ఉత్పత్తులపై ఇక నుంచి అమెరికాలో 18 శాతం సుంకాలు మాత్రమే ఉంటాయి" అని పోస్టు చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు.
Piyush Goyal
India US trade deal
US India trade agreement
Donald Trump
Narendra Modi
India tariffs

More Telugu News