లోక్ సభలో ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్: పార్లమెంటు వర్గాలు!
- అందుకే ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానం
- మోదీ మాట్లాడే సమయంలో దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం వచ్చిందన్న లోక్ సభ వర్గాలు
- అందుకే మహిళా ఎంపీలను పంపించారని వెల్లడి
దాంతో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్ సభ గురువారం ఆమోదించింది.
ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడం అరుదైన అంశమని, ఈ సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్లాన్ చేసినట్లు సమాచారం వచ్చిందని లోక్ సభ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకోసమే మహిళా ఎంపీలను పంపించారని పేర్కొంది. ప్రసంగించేందుకు మోదీ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సమాచారంతో బుధవారం సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని తెలిపింది.