Narendra Modi: ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ఆమోదం

Lok Sabha Approves Motion of Thanks Without PM Modi Speech
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని గురువారం నాడు లోక్ సభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే ఆమోదం పొందడం గమనార్హం. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలతో ప్రధానమంత్రి ప్రసంగించకుండానే నిన్న సభ వాయిదా పడింది. ఈరోజు సభ మొదలైన తర్వాత ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.

రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి

లోక్ సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య భారతంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఎలాగని ప్రశ్నించారు. సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలనేదే తమ సింగిల్ పాయింట్ అజెండా అన్నారు. అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేంద్రం ఈ ఒప్పందం ద్వారా రైతుల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు.

లోక్ సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయంలో కేంద్రం ఆందోళన చెందుతోందని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందంతో రైతులకు నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Presidential Address
Lok Sabha
Motion of Thanks
Rahul Gandhi
KC Venugopal

More Telugu News