MS Narayana: నాన్న లేకపోవడంతో పదేళ్లుగా పండగ లేదు.. ఎమ్మెస్ నారాయణ కూతురు శశి!
- స్టార్ కమెడియన్ గా వెలిగిన ఎమ్మెస్
- చివరివరకూ కష్టపడ్డారన్న కూతురు
- తమ ఎదుగుదలను చూడలేదని ఆవేదన
- ఇకపై సంక్రాంతి జరుపుకుంటామని వెల్లడి
తెలుగు తెరపై హాస్య నటుడిగా ఎమ్మెస్ నారాయణకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవి. తాగుబోతు పాత్రలలో ఆయన జీవించేవారు. అలాంటి ఎమ్మెస్ నారాయణ కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. అయితే ప్రేక్షకులు ఆయనను ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెస్ గురించి ఆయన కూతురు శశి కిరణ్ నారాయణ 'ఐ డ్రీమ్ మీడియా'తో మాట్లాడారు.
"నాన్నగారు లెక్చరర్ .. రైటర్. సినిమాలలో రైటర్ కావాలని ఆయన అనుకున్నారు. అయితే నటుడిగానే ఆయనకి ఎక్కువగా గుర్తింపు లభించింది. నాన్నగారు ఎంత మాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉండేవారు. ఆ సమయంలో మేము కూడా మా కెరియర్ కి సంబంధించిన పనులతో బిజీగా ఉండేవాళ్లం. ఆయన అస్సలు రిలాక్స్ కాలేదు. కష్టపడుతూనే ఉండేవారు. ఆయన కాస్త తీరికగా ఉండి .. మా ఎదుగుదలను చూస్తే బాగుండేదని మాకు అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు.
"మా నాన్నగారు సంక్రాంతి పండుగ సందర్భంగా 'భీమవరం' వెళ్లారు. అక్కడే ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన మాకు దక్కలేదు. ఆయన చనిపోయిన తరువాత పదేళ్లుగా మేము సంక్రాంతి పండుగ చేసుకోలేదు. కానీ సంక్రాంతి పండుగ అంటే ఆయనకి ఎంతో ఇష్టం కనుక, వచ్చే ఏడాది నుంచి ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అలా చేస్తే ఆయన ఆత్మ సంతోషపడుతుందనేది మా నమ్మకం" అని చెప్పారు.