Sara Arjun: 'యుఫోరియా'లో ధురంధర్ భామ.. సారా అర్జున్!

Sara Arjun Interview
  • హీరోయిన్ గా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్
  • 'యుఫోరియా'కి ఆమెనే ప్రత్యేకమైన ఆకర్షణ 
  • యూత్ చూపులన్నీ ఆమె పైనే 
  • ఈ సినిమాపై నమ్మకంతో ఉన్న గుణశేఖర్ 

బాలీవుడ్ నుంచి ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వైపు దృష్టిపెట్టినా, అందరూ ఓ అందమైన అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నారు. చక్కని కనుముక్కుతీరున్న ఈ అమ్మాయిపై ఎన్ని కథలైనా .. కావ్యాలైన రాయొచ్చునని అనుకుంటున్నారు. 'పొన్నియిన్ సెల్వన్'లో ఐశ్వర్య రాయ్ కి టీనేజ్ పాత్ర చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరింత అందంగా తయారైందే అంటూ ఆశ్చర్యపోతున్నారు.'ధురంధర్' సినిమా ద్వారా అందరి చూపును ఆకర్షించిన ఆ సుందరినే సారా అర్జున్.  
 
సారా అర్జున్ టాలీవుడ్ లో ఫలానా హీరోతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే చర్చలు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ఈ బ్యూటీని 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు గుణశేఖర్ తీసుకొస్తున్నారు. జానపద .. పౌరాణికాలను సమర్థవంతంగా తెరకెక్కించగల దర్శకుడిగా గుణశేఖర్ కి పేరుంది. ఎంతటి భారీ కథనైనా అందంగా తెరపై ఆవిష్కరించగలిగిన నేర్పు ఆయన సొంతం. ఆయన ఏ జోనర్ నుంచి ఏ కథను ఎంచుకున్నా, తనదైన ముద్ర కనిపిస్తుంది.

 అలాంటి గుణశేఖర్ నుంచి వస్తున్న తాజా చిత్రమే 'యుఫోరియా'. నీలిమా గుణ - యుక్తా గుణ ఈ సినిమాను నిర్మించగా, ఈ నెల 6వ తేదీన థియేటర్లకు రావడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. భూమిక - సారా అర్జున్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది. కీలకమైన పాత్రలో గౌతమ్ వాసుదేవ మీనన్ కనిపించనున్నారు. యూత్ ఎలా తప్పుదోవ పడుతుందనేది తాను చాలా బోల్డ్ గా చూపించాననీ, తప్పకుండా అందరినీ ఆలోచింపజేసేదిలా ఈ సినిమా ఉంటుందని గుణశేఖర్ అంటున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ వైపు నుంచి కూడా సారా అర్జున్ హిట్ అందుకుంటుందేమో చూడాలి మరి. 

More Telugu News

Sara Arjun
Euphoria Movie
Gunasekhar
Bhumika Chawla
Gautham Vasudev Menon
Tollywood
Telugu cinema
Ponniyin Selvan
Youth movie
Neelima Guna