Rajamahendravaram Tiger: రాజమండ్రిలో ఇంకా దొరకని పెద్దపులి

Rajamahendravaram Tiger Still Not Found
  • శాటిలైట్ సిటీ పరిధిలోని జీడిమామిడి తోటలో పులి సేద తీరుతున్నట్లు గుర్తింపు  
  • ఎలాగైనా మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధిస్తామన్న చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్  
  • పులిని పట్టుకునేందుకు 12 బృందాలు సిద్దంగా ఉన్నాయని వెల్లడి 
రాజమండ్రి ప్రాంతంలో గత ఐదు రోజులుగా  పెద్దపులి సంచారం ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అది రోజుకో గ్రామానికి మకాం మార్చుకుంటూ అటవీ అధికారులకు సవాల్ విరుసుతోంది. రాజమండ్రి రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. 

పులి జాడ కోసం అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, బుధవారం రాత్రికి రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మతల్లి కొండ పక్కన జీడిమామిడి తోటలో పులి సేద తీరుతున్నట్లు గుర్తించారు. ఎలాగైనా పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి దాని సహజ ఆవాసానికి తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

పెద్దపులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అటవీ శాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌ను స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ బి.ఎన్‌.ఎన్‌. మూర్తి, డీఎఫ్‌వో ప్రభాకరరావు, ఎఫ్‌ఆర్‌వో ఎస్‌.దావీదురాజు నాయుడు, ఎన్‌టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తువైద్యులు డా. ఫణీంద్ర నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

పెద్ద పులి సంచరిస్తున్న గ్రామాల్లో పర్యటించిన స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.వి. చలపతిరావు మాట్లాడుతూ.. పులి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అయితే రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. పులి రోజుకు 15 నుంచి 20 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని తెలిపారు. జీడితో సేదతీరుతున్న పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 

More Telugu News

Rajamahendravaram Tiger
Tiger
Rajamahendravaram
Andhra Pradesh Forest
Wildlife
P V Chalapathi Rao
Forest Department
Tiger Rescue Operation
Rajanagaram
Wildlife Tracking