రేపు మండలి చైర్మన్ మోషేను రాజు కుమారుడి వివాహం... హాజరుకానున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు (ఫిబ్రవరి 5) పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన భీమవరం రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

వివరాల్లోకి వెళితే, రేపు ఉదయం 10:30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పెదఅమిరంలోని శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లి వివాహ వేడుకలో పాల్గొంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, మధ్యాహ్నం 12:00 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు.

మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భీమవరం, పెదఅమిరం ప్రాంతాల్లోని వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. 


More Telugu News