తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎయిడ్స్ మరణాలు.. ఐటీ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఐవీ

ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం... 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. 

ఏపీలో 32,642 మంది చనిపోగా... తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఐటీ రంగంలో హెచ్ఐవీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ వ్యవస్థ వెల్లడించింది. విదేశీ తరహా జీవనశైలికి అలవాటు పడటం ఐటీ రంగంలో హెఐవీ వ్యాప్తి కావడానికి కారణమవుతోందని తెలిపింది. ఈ రంగంలో హెచ్ఐవీ పరీక్షల సంఖ్యలను పెంచాల్సి ఉందని సూచించింది.


More Telugu News