ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

  • రాష్ట్రంలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి
  • ఆంధ్రా వర్సిటీ కల్చర్ బ్లాక్‌కు గద్దర్ పేరు పెట్టాలని కోరిక
  • విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి!
ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్‌ కుమార్తె వెన్నెల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వెన్నెల... తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలను గుర్తు చేశారు. తమ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వెన్నెల తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దర్ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.


More Telugu News

Gaddar Chandrababu Naidu Gaddar statue Andhra University Vennela Gaddar AP CM Telugu culture People's movements Andhra Pradesh