వైసీపీ నేతలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలి: బైరెడ్డి

  • రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న నిజాలను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్న బైరెడ్డి
  • సీమ అభివృద్ధి ఎన్టీఆర్ చేసినంత ఎవరూ చేయలేదని వ్యాఖ్య
  • కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకే లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపణ
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని... ఏ అజెండాతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారో వైసీపీ నేతలు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని సీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరిగిపోతోందంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని... సీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప గొప్పగా ఎవరూ ఏమీ చేయలేదని అన్నారు. బడ్జెట్ తక్కువగా ఉన్న రోజుల్లోనే రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. 

తిట్లు తిట్టడంలో వైసీపీ నేతలకు ప్రావీణ్యం ఉందని... ప్రాజెక్టులపై వారికి ఎలాంటి అవగాహన లేదని బైరెడ్డి ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్లు ఖర్చు పెట్టారని... అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక రహస్య అజెండా ఉందని ఆరోపించారు. కాంట్రాక్లర్ల కడుపు నింపేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. దీనిపై కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలో చర్చ జరపాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. 


More Telugu News

Byreddy Rajasekhar Reddy Rayalaseema Lift Irrigation Project YSRCP Kurnool Kondareddy Burj Andhra Pradesh Politics TDP NTR Projects Irrigation Projects Andhra Pradesh