మహేశ్ బాబు 'వారణాసి' ఎన్ని పార్టులుగా వస్తోందనే దానిపై.. కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి
- భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'వారణాసి'
- రెండు భాగాలుగా ఈ సినిమా వస్తుందంటూ ప్రచారం
- ఒక సినిమాగానే విడుదల చేస్తామని వెల్లడించిన రాజమౌళి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఎంతో ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి చెక్ పెట్టారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ... రెండు భాగాలుగా సినిమాను నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ... చివరకు ఒక పార్ట్ గానే విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండవచ్చని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో 'రుద్ర' అనే పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పూర్తి స్థాయి ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించబోతోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేఎల్ నారాయణ, ఎస్. గోపాల్ రెడ్డి, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.