మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు
- ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్
- కిడ్నాపర్లను గంటన్నరలో పట్టుకున్న పోలీసులు
- బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వ్యక్తులు వీరిని ఓ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కిడ్నాప్ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు... కిడ్నాపర్లను వెంబడించారు. గంటన్నరలోనే వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశారు.
నిందితులను పీఎస్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు... యూనివర్శిటీ పీఆర్వో సతీశ్ ను ఏ1గా, మోహన్ బాబును ఏ2గా, మంచు విష్ణును ఏ3గా చేర్చారు.