సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
- కేంద్ర ఎన్నికల సంఘం, SIRకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మమత
- ఈ పిటిషన్ ను ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు
- తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించనున్న మమత
మమత విషయానికి వస్తే... ఆమె కోల్ కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. తన పిటిషన్ కు సంబంధించి... సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో సొంతంగా వాదనలు వినిపించబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.