గోవా, కర్ణాటక వెళ్లాలనుందా?.. టీజీఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు
- ఒక్కో టికెట్ ధర రూ. 5,130
- గోవా, మురుడేశ్వర, ఉడిపి యాత్ర
- శ్రీశైలానికి రోజూ ఏసీ సర్వీసులు
- మార్చి 6న తుల్జాపూర్ స్పెషల్ బస్సు
ఈ నెల 25న బీహెచ్‌ఈఎల్ లింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. ఈ టూర్ మార్చి 1న తిరిగి లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ యాత్రలో భాగంగా కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర ఆలయాలతో పాటు గోవాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కో ప్రయాణికుడికి కేవలం రూ. 5,130 గా నిర్ణయించారు.
రామచంద్రాపురం, బీరంగూడ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రతిరోజూ సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసులను నడుపుతున్నారు. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
మార్చి 6న బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి తుల్జాపూర్ భవానీ మాత సందర్శనార్థం ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. ఈ ట్రిప్‌లో గానుగాపూర్, కొల్హాపూర్, పండరీపూర్ క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. దీనికి ఒక్కొక్కరికి రూ. 3,000 చార్జీ వసూలు చేయనున్నారు. ఆసక్తి గల ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా ఏటీబీ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ చేసుకోవచ్చు.