పోటీదారులతో పోలిస్తే అమెరికాతో భారత్ మెరుగైన ఒప్పందాన్ని సాధించింది: పీయూష్ గోయల్
- అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉజ్వల భవిష్యత్తుకు శుభసూచకమన్న కేంద్రమంత్రి
- ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ కొలిక్కి తీసుకువచ్చారన్న పీయూష్ గోయల్
- ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని విమర్శ
దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా పోటీదారులతో పోలిస్తే భారత్ మెరుగైన ఒప్పందాన్ని సాధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత ఉజ్వల భవిష్యత్తుకు ఒక శుభసూచకమని ఆయన అన్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ కొలిక్కి తీసుకువచ్చారని అన్నారు. ఈ విషయంలో దేశమంతా ఆయనకు అభినందనలు తెలుపుతోందని అన్నారు.
ఈ ఒప్పందంతో పేదలు, రైతులు, యువత, మత్స్యకారులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంటులో ప్రకటన చేద్దామని భావించానని, కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని అన్నారు. ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందంతో మన దేశ వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ప్రధాని మోదీ పరిరక్షించారని అన్నారు. నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య ఉన్న సత్సంబంధాల వల్లనే రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అన్నారు. సుంకాల తగ్గింపు ప్రకటన ట్రంప్ నుంచి వచ్చిందని, వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలను ఖరారు చేశాక, సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని అన్నారు.