ఇకపైనా ఆ ప్రయత్నం కొనసాగిస్తా: 'పద్మశ్రీ'పై రోహిత్ శర్మ వ్యాఖ్యలు
- భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారం
- ఇది తనకు, తన కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణమని వెల్లడి
- దేశం కోసం మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలిచే ప్రయత్నం కొనసాగుతుందన్న రోహిత్
- 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత
- టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా వన్డేల్లో కొనసాగుతున్న హిట్ మ్యాన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ' అందుకోవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది తనకు, తన కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణమని, దేశం కోసం మ్యాచ్‌లు గెలిచే తన ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ వీడియోలో రోహిత్ మాట్లాడాడు.
"పద్మశ్రీ పురస్కారం అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా దేశం కోసం మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలిచే నా ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ధన్యవాదాలు. జై హింద్" అని రోహిత్ పేర్కొన్నాడు.
2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, గత 19 ఏళ్లుగా భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. హిట్ మ్యాన్ సారథ్యంలోనే భారత జట్టు 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 67 టెస్టుల్లో 4,300 పరుగులు... 282 వన్డేల్లో 11,500 పరుగులు... టీ20ల్లో 4,231 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ 2027 ప్రపంచకప్ లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నాడు.