Gold Price: రూ.6 వేలు పెరిగిన బంగారం, భారీగా పెరిగిన వెండి ధర

Gold Price Increased Sharply in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ధరలు ఆకాశాన్నంటాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్‌కు కొత్త ఛైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్ పెంచడం, గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విలువైన ఈ లోహాల ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే ఈరోజు ధరలు పుంజుకున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు మధ్యాహ్నం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.56 లక్షలు పలికింది. సోమవారం నాటి ధరతో రూ.6 వేలు పెరిగింది. కిలో వెండి ధర రూ.2.74 లక్షలు పలికింది. కిలో వెండి ధర రూ.20 వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Go Back to Shorts
Gold Price
Gold
Silver Price
Silver
Hyderabad
Bullion Market
Commodity Market
Price Hike

More Telugu News