అమెరికాతో వాణిజ్య ఒప్పందం... ప్రధాని మోదీకి సన్మానం

భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే ఎంపీలు సన్మానం చేశారు. ఈ ఒప్పందం కోసం మోదీ చేసిన కృషికి గాను వారు సన్మానం చేశారు. ఈ సన్మానం సమయంలో ఎంపీలు 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం' అంటూ నినాదాలు చేశారు.

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీ నేపథ్యంలో మొదట మోదీని సన్మానించారు. అనంతరం పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు.

కాగా, భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. భారత్‌పై ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై 50 శాతం సుంకం ఉండగా ఇప్పుడు అది 18 శాతానికి తగ్గుతుంది. ఈ 50 శాతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. ఇప్పుడు అదనపు సుంకాలను తొలగిస్తున్నట్లు అమెరికా తెలిపింది.


More Telugu News