అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు
- సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ అంబటిపై ఫిర్యాదు
- ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైనం
- టీడీపీ రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్, పాతర్ల రమేశ్‌ల ఫిర్యాదుతో కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై తాజాగా మరో కేసు నమోదైంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై గత నెల 31న టీడీపీ రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్, పాతర్ల రమేశ్‌లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఇప్పటికే గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.