ధనుష్ పక్కన మరోసారి చాన్స్ కొట్టేసిన సాయి పల్లవి
- ధనుష్ 55వ చిత్రంలో హీరోయిన్‌గా సాయి పల్లవి ఎంపిక
- ‘మారి 2’ తర్వాత రెండోసారి జత కడుతున్న ధనుష్, సాయి పల్లవి
- ఇప్పటికే ఈ చిత్రంలో మరో కథానాయికగా శ్రీలీల పేరు ఖరారు
- రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం
- యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు
స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి రూపొందిస్తున్న భారీ చిత్రంలో ప్రముఖ నటి సాయి పల్లవి హీరోయిన్‌గా ఎంపికైంది. సోమవారం చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన 'మారి 2'లో ధనుష్, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ కాంబో రిపీట్ కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటి. తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా సాయి పల్లవికి స్వాగతం పలుకుతూ, "ఆమె అందం, శక్తి రెండింటి కలబోత. అందరి ఫేవరెట్ సాయి పల్లవికి #D55 టీంలోకి స్వాగతం. హిట్ కాంబో మళ్లీ వెండితెరపైకి వస్తోంది" అని పోస్ట్ చేసింది.
గతంలో ధనుష్, సాయి పల్లవి కలిసి బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన 'మారి 2' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా 'రౌడీ బేబీ' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ హిట్ జోడీ మళ్లీ తెరపై సందడి చేయనుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ఇప్పటికే మరో కథానాయికగా యువతరం క్రేజీ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జనవరి 30న ఆమెను టీంలోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరితో పాటు యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్‌ను ఈ చిత్రానికి సంగీత దర్శకుడి వ్యవహరిస్తున్నాడు. దీనిపై సాయి అభ్యంకర్ స్పందిస్తూ, ధనుష్‌తో పనిచేయడం ఒక కల అని, ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రాన్ని ఒక భారీ దృశ్యకావ్యంగా (మాగ్నమ్ ఓపస్) నిర్మిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. వండర్‌బార్ ఫిలింస్‌తో పాటు ఆర్ టేక్ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరినట్లు ఇటీవలే ప్రకటించారు. భారీ తారాగణం, ప్రముఖ నిర్మాణ సంస్థలు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో 'D55' చిత్రంపై కోలీవుడ్‌లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.