కోహ్లీ ప్రపంచ రికార్డు బ్రేక్.. టీ20ల్లో బాబర్ ఆజం సరికొత్త చరిత్ర

  • టీ20ల్లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన బాబర్ ఆజం
  • అత్యధిక అర్ధ శ‌త‌కాలు (39) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయ‌ర్‌
  • ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన పాక్ బ్యాటర్
  • కోహ్లీ 125 ఇన్నింగ్స్‌లలో చేయగా, బాబర్‌కు 139 ఇన్నింగ్స్‌లు పట్టిన వైనం
  • ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ (37)
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో 39 అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ చరిత్రకెక్కాడు.

నిన్న‌ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బాబర్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేసిన అతను, తన 39వ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 38 హాఫ్ సెంచరీలతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని రెండో స్థానానికి నెట్టాడు. అయితే, కోహ్లీ కేవలం 125 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బాబర్‌కు 139 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (37) మూడో స్థానంలో, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (31) నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (29) ఐదో స్థానంలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్, వార్నర్ ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. మరోవైపు రిజ్వాన్ ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోవడంతో బాబర్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంది.


More Telugu News