Indian Air Force: వృద్ధురాలిని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించిన వాయుసేన.. వీడియో ఇదిగో!

Indian Air Force Rescues Elderly Woman in Himachal Pradesh by Helicopter
షార్ట్స్‌లో చూడండి
హిమాచల్ ప్రదేశ్ లో దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా చాలా చోట్ల రహదారులు మూతపడ్డాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచు కారణంగా జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో ధండేర్వరి అనే మారుమూల గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు పెరాలసిస్ స్ట్రోక్ కు గురైంది.

రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే వీలులేకపోవడంతో ఆ వృద్ధురాలి కుటుంబం, గ్రామస్థులు కలిసి సైన్యాన్ని సాయం కోరారు. పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన అధికారులు.. చీతా హెలికాప్టర్ ను పంపించారు. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పటికీ సోల్జర్లు రిస్క్ చేసి ధండేర్వరి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వృద్ధురాలిని తీసుకుని చండీగఢ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం కోలుకుంటోంది. ఈ సందర్బంగా ఆ వృద్ధురాలి కుటుంబంతో పాటు ధండేర్వరి గ్రామస్థులు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వృద్ధురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోను ఐఏఎఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.
Go Back to Shorts
Indian Air Force
Himachal Pradesh
Helicopter Rescue
Paralysis Stroke
Dhanderwari Village
Chandigarh Hospital
IAF Cheetah Helicopter
Elderly Woman
Snowfall
Remote Village

More Telugu News