బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 33 మందిపై కేసు నమోదు
- కేసీఆర్ కు సిట్ నోటీసులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టిన బీఆర్ఎస్
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం - వరంగల్లు జాతీయ రహదారిపై నిరసన
- సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా నిన్న ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 33 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందున ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.