ఫోన్ ట్యాపింగ్ కేసు: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

  • కేసీఆర్ ను 4 గంటల 50 నిమిషాల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు
  • కేసీఆర్ వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేసిన అధికారులు
  • నిందితుల వాంగ్మూలాల ఆధారంగా సాగిన దర్యాప్తు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), కేసీఆర్‌ను దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు విచారించింది. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం, వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మొత్తం విచారణ ప్రక్రియను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ పూర్తయిన తర్వాత సిట్ బృందం కేసీఆర్ నివాసం నుంచి వెనుదిరిగింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ విచారించింది. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది.


More Telugu News