తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్

  • లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారన్న భరత్
  • తప్పు చేసి.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామన్న మంత్రి
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి... ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో పింఛన్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తిరుమలను కాపాడేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని భరత్ చెప్పారు. తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేశామని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని అద్భుతంగా ప్రమోట్ చేశామని తెలిపారు. దీని అద్భుత ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు.


More Telugu News