రైలు పట్టాలపై కుటుంబం ఆత్మహత్య.. ఘట్ కేసర్ లో ఘోరం

  • ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం
  • బోడుప్పల్ కు చెందిన కుటుంబంగా గుర్తించిన పోలీసులు
  • పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలింపు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి– ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులను బోడుప్పల్ కు చెందిన సురేందర్‌ రెడ్డి, విజయ, చేతన రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News