విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి తెరలేపింది: బొత్స సత్యనారాయణ

  • జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద వైసీపీ నిరసనలు
  • గీతం యూనివర్శిటీ భూదోపిడీని అరికట్టాలని నినాదాలు
  • ప్రజల ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్న బొత్స
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. గీతం యూనివర్సిటీ భూదోపిడీని అరికట్టాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు తదితర నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖలో భూదోపిడీకి తెరలేపిందని అన్నారు. అధికారం ఉందని భూదోపిడీ చేస్తే పేద కుటుంబాల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.


More Telugu News