క్యాస్టింగ్ కౌచ్ ఉంది... మహిళలను వాడుకునేందుకే కొందరు సినిమాలు తీస్తారు: తమ్మారెడ్డి భరద్వాజ

  • టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశమైన క్యాస్టింగ్ కౌచ్
  • ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరన్న తమ్మారెడ్డి
  • సినీ పరిశ్రమ తొలి రోజుల నుంచే ఈ సమస్య ఉందని వ్యాఖ్య
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ మీట్ సందర్భంగా సినిమాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి ఆజ్యం పోశాయి. సినిమా ఇండస్ట్రీని అద్దంతో పోల్చిన ఆయన... ఇండస్ట్రీ చాలా బాగుందని... అవకాశాల కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందిస్తూ... ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని అన్నారు. చిరంజీవి తొలిరోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో తమకు తెలియదని... కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, ఇదే అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తొలి రోజుల నుంచే ఈ సమస్య ఉందని చెప్పారు. ఒకప్పుడు రాజ కుటుంబాల వారు, జమీందారులు మహిళల కోసమే సినిమాలు తీసేవారని అన్నారు. 

ప్రస్తుతం ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే... వాటిలో 30 నుంచి 40 సినిమాలు మహిళలను వాడుకునే ధోరణితోనే నిర్మితమవుతున్నాయిని తమ్మారెడ్డి చెప్పారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలోని ఒకరిద్దరు సినీ పెద్దల్లో ఉందని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమేనని చెప్పారు.


More Telugu News