కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఆ మాట చెప్పి బ్లాక్‌మెయిల్ చేయవద్దు: మధుయాష్కీ
- దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్న మధుయాష్కీ
- సీఎం, మంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని స్పష్టీకరణ
- జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారేవారని వ్యాఖ్య
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని మధుయాష్కీ అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశమయ్యారనేది అబద్ధపు ప్రచారం అన్నారు. ప్రతిరోజు వాళ్లంతా టచ్‌లోనే ఉంటారని అన్నారు
జగిత్యాలలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ల అంశంపై కూడా మధుయాష్కీ స్పందించారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారేవారని అన్నారు. అలాంటి సీనియర్ నాయకులు పదవుల కోసం కాదని, పార్టీ కోసం పని చేస్తారని వ్యాఖ్యానించారు. సింగరేణిలో అక్రమాలు జరిగాయన్న బీఆర్ఎస్ ఆరోపణలపై మధుయాష్కీ స్పందిస్తూ, అసలు బొగ్గే తవ్వలేదు అవినీతి ఎక్కడ జరుగుతుందని అన్నారు.