ట్రంప్ కు మతిమరుపా.. తన ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు ఏమన్నారంటే..!
- తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడ్డారని గుర్తుచేసుకున్న ట్రంప్
- తనకలాంటి సమస్యలేవీ లేవని స్పష్టం చేసిన అధ్యక్షుడు
- కొంతకాలంగా ట్రంప్ ఆరోగ్యంపై పలు వదంతులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వ్యక్తులు, అధికారుల పేర్లను ఆయన మరిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడిన విషయం నిజమేనని, అయితే, తనకు ఆ సమస్య లేదని ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల క్రితం ఉన్నట్లే ఇప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడ్డారని చెబుతున్న క్రమంలో ట్రంప్ ఆ వ్యాధి పేరును మర్చిపోయారు. కొంత ప్రయత్నం తర్వాత గుర్తుచేసుకుని తిరిగి సంభాషణ కొనసాగించారు.
వైట్ హౌస్ స్పందన..
ప్రెసిడెంట్ ట్రంప్ ఇంటర్వ్యూపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా, బలంగా ఉన్నారని ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలిందని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సేనల సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేయడానికి కావాల్సిన శరీర సామర్థ్యం ఆయనకు ఉందని పేర్కొంది. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మీడియాకు సూచించింది.