హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై దగ్ధమైన కారు

  • రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీ సమీపంలో కారులో మంటలు
  • నిఖిల్ అనే వ్యక్తి నార్సింగి వెళుతుండగా ప్రమాదం
  • అప్రమత్తమై కారులో నుంచి బయటకు వచ్చిన నిఖిల్
హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక కారు అగ్నికి ఆహూతైంది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే కారు దిగి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అయితే, అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. నిఖిల్ అనే వ్యక్తి తుక్కుగూడ నుంచి నార్సింగికి వెళుతుండగా, అతడు ప్రయాణిస్తున్న వాహనంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 


More Telugu News