అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొణె.. ఆమె నా లక్కీ ఛార్మ్‌ అన్న అట్లీ

  • 'ఏఏ 22'లో బన్నీ సరసన దీపిక
  • ఈ సినిమాలో దీపిక చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుందన్న అట్లీ
  • షారుఖ్, దీపిక, అట్లీ కాంబినేషన్లో వచ్చిన 'జవాన్' ఘన విజయం

స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఏఏ 22’ (AA22) పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంపై అట్లీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ దీపికా పదుకొణె తనకు లక్కీ ఛార్మ్ అని, ఆమె ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారని, ఆమె నటన అందరినీ కట్టిపడేస్తుందని ఆయన చెప్పారు.


ఒక మీడియా సంస్థతో అట్లీ మాట్లాడుతూ, "దీపిక నా లక్కీ ఛార్మ్. ఆమె ఈ సినిమాలో చాలా ఫ్రెష్‌గా, కొత్తగా కనిపిస్తారు. ఆమె నటన అద్భుతంగా ఉంటుంది" అని అన్నారు. షారుఖ్ ఖాన్ – దీపికలతో అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడితో కలిసి పనిచేయనున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’లతో థ్రిల్ పంచిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు బన్నీ కెరీర్‌లో కీలకమైనవిగా నిలుస్తాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



More Telugu News