సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

  • ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఫైర్
  • ప్రగతిభవన్‌ ముందు గద్దర్ ఎదురుచూపులకు కారణం అతడేనని విమర్శ 
  • రేవంత్ రెడ్డికి గూఢచారి అంటూ తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు.

విచారణ సంగతేమో కానీ ఈ కేసులో ఆయనకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదని చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని అన్నారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు దాడి చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను మంగళవారం కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ, కేసీఆర్ సన్నిహితుడు సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.


More Telugu News