Pit Bull: మంచు కొండల్లో యజమాని మృతి.. నాలుగు రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం

Loyal Pit Bull Keeps Watch Over Dead Owner in Himachal Snow
  • గడ్డకట్టించే చలిలోనూ మృతదేహం పక్కనే ఉన్న పిట్ బుల్
  • హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో ఘటన
  • రెస్క్యూ సిబ్బందినీ దగ్గరికి రానివ్వని వైనం
హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి అది కదలలేదు.

ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంటతడి పెట్టారు. నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని తరలించారు.
Pit Bull
Himachal Pradesh
Bharmaur
dog loyalty
dog guarding owner
man death
snowfall
rescue operation
animal love
viral video

More Telugu News