తెలంగాణలో బీజేపీకి షాక్.. వరంగల్ జిల్లాలో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
- బీజేపీకి ఆరూరి రమేశ్ రాజీనామా
- త్వరలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన
- ఎల్లుండి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేశ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తాను బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు తన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్‌లోకి త్వరలో వెళుతున్నానని ఆయన పేర్కొన్నారు. పలువురు నాయకులు, అనుచరులతో కలిసి త్వరలో బీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. ఇంతకాలం తనకు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఎల్లుండి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.
ఆరూరి రమేశ్ గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.