ఆప్యాయంగా మాట్లాడుకున్న నారా లోకేశ్, బొత్స సత్యనారాయణ
- 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు నేతలు
- లోకేశ్, బొత్స మధ్య సరదా సంభాషణ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి ప్రభుత్వ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. నారా లోకేశ్, బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు నేతలు ఉన్నారు.