మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ నివాసాలకు స్వయంగా వెళ్లి సన్మానించిన చిరంజీవి
- మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు పద్మశ్రీ పురస్కారాలు
- శాలువాలతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
- ఇది మన తెలుగు సినిమాకు గర్వకారణమన్న మెగాస్టార్
ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒకే ఏడాది ఇద్దరు తెలుగు సినీ నటులకు పద్మశ్రీలు రావడం పట్ల సర్వత్ర సంతోషం వ్యక్తమవుతోంది.ఈ గౌరవం తెలుగు సినీ పరిశ్రమకు, సాంస్కృతిక రంగానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి మరింత ప్రత్యేకంగా మార్చారు. ఆయన స్వయంగా మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధం, పరస్పర గౌరవం ఈ సందర్భంలో ప్రతిబింబించాయి.
ఈ సందర్భంగా చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఇది నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అన్నారు. "పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు... ఇది మన తెలుగు సినిమాకు గర్వకారణం" అని ఆయన పోస్ట్ చేశారు.