ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం... సంతోష్ రావుకు సిట్ నోటీసులు
- రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
- బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న సంతోష్ రావు
- ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 27) మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సిట్ దర్యాప్తు బృందం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.